ఇంటర్వ్యూ : ప్రవీణ్ సత్తారు – ‘ది ఘోస్ట్ ‘ క్లాస్ గా తీసిన పక్కా మాస్ మూవీ, చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ వుంటాయి, ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు

ఇంటర్వ్యూ : ప్రవీణ్ సత్తారు – ‘ది ఘోస్ట్ ‘ క్లాస్ గా తీసిన పక్కా మాస్ మూవీ, చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ వుంటాయి, ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు

Published on Oct 1, 2022 8:00 PM IST

కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా సోనాల్ చౌహన్ హీరోయిన్ గా లేటెస్ట్ గా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ ది ఘోస్ట్. ఇటీవల రాజశేఖర్ తో గరుడవేగా మూవీ తీసి సూపర్ హిట్ అందుకున్న ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ మూవీ అక్టోబర్ 5న దసరా పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సందర్భంగా నేడు కొద్దిసేపటి క్రితం డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు.

 

‘ది ఘోస్ట్’ టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి ?

నిజానికి ఇంటెలిజెన్స్ ఫీల్డ్ ఈ ఘోస్ట్ అనే పదానికి ఒక అర్ధం ఉంది. సినిమాలో అండర్ వరల్డ్ మాఫియా హీరోని ఆ పేరుతో పిలుస్తారు. నిజానికి ఆ పదానికి ఒక పవర్ ఉంది.

 

నాగార్జున గారిని కలిసి కథ చెప్పడం ఎలా అనిపించింది ?
మొదట ఈ కథని నిర్మాతలు సునీల్ గారికి, శరత్ మరార్ గారికి వినిపించారు. నేను తొలిసారిగా ఒక హీరో కోసం రాసుకున్న కథ ఇది. నాకు ఆయన అంటే ప్రత్యేకమైన ఇమేజ్, ఇష్టం ఉంది. దానిని బేస్ చేసుకుని ఆయన ఇమేజ్ కి తగ్గట్లుగా ఒక కథ సిద్ధం చేయాలని ది ఘోస్ట్ మూవీ స్టోరీ సిద్ధం చేశాను. ఇందులో ఆయన పాత్రకి డైలాగ్స్ తక్కువ బట్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఆయనది ఎంతో పవర్ఫుల్ క్యారెక్టర్, అలానే ప్రతి యాక్షన్ సీన్ కి ఒక బలమైన ఎమోషన్ ఉంటుంది.

 

ఫస్ట్ టైం ఒక హీరో కోసం కథ రాసినప్పుడు ఎటువంటి సవాళ్లు ఎదుర్కోవలసి వచ్చింది ?

నామటుకు నాకు అయితే ఒక హీరోని అనుకుని కథ రాసుకోవడం ఈజీ అని చెప్తాను. ఎందుకంటే ముందుగా కథ రాసుకుని దాని తరువాత దీనికి ఎవరు సరిపోతారు అనేది వెతుక్కోవడం కొంత కష్టం. అలానే స్టోరీ సిద్ధం చేసుకునే సమయంలోనే ఆయన ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని అన్ని వరాల ఆడియన్స్ ని మెప్పించేలా దీనిని సిద్ధం చేసాను.

 

ఈ మూవీ కోసం తమహాగానే వంటి ఆయుధాలు సిద్ధం చేసారు కదా, వాటి గురించి చెప్పండి ?

ముందుగా కథ రాసుకున్నపుడే ప్రతి పాత్రకి ఒక బ్యాక్ స్టోరీ సిద్ధం చేస్తాము. ఇందులో హీరో క్యారెక్టర్ 40 ఏళ్ళ వయసు గల ఇంటర్ పోల్ అధికారి. ఆయన తన జర్నీ లో ఎన్నో మిషన్లో పాల్గొంటారు. అందులో ఒక మిషన్ లో భాగంగా ఒక సందర్భంలో జపాన్ వెళ్ళినపుడు అక్కడ ఒక వ్యక్తి ఇచ్చే మెటల్ తమహాగనే, ఇందులో మొత్తం 12 యాక్షన్ బ్లాక్ లు ఉంటాయి. ఇక ఆడియన్స్ కి అడ్రినల్ రష్ ఇచ్చే సినిమా అవుతుంది.

 

హీరోయిన్ సోనాల్ చౌహాన్ గురించి చెప్పండి ?

తాను చాలా హార్డ్ వర్కర్. తన పాత్ర కోసం మాకు కొంత సమయం ఇచ్చి ఎంతో కష్టపడి పాత్ర కోసం వర్క్ చేసారు. తనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది.

 

ఈ మూవీ విషయంలో మీరు ఎదుర్కున్న పెద్ద సవాళ్లు ఏంటి ?

నిజానికి కోవిడ్ వల్లనే కొంత సమస్యలు వచ్చాయి. కొన్ని ఎపిసోడ్స్ కోసం దుబాయ్ కి వెళ్ళాము. కోవిడ్ సెకండ్, థర్డ్ వేవ్ ల సమయంలో ఎంతో ఇబ్బంది ఎదురైంది. ఇక దుబాయ్ కి వెళ్లిన సమయంలో యాక్షన్ కొరియోగ్రాఫర్ రెక్కీకి వెళ్లి తరువాత అంబూటులోకి రాకవపోడంతో మరొకరితో వర్క్ చేయాల్సి వచ్చింది. ఆ కారణంగా కొన్ని పర్మిషన్స్ కూడా కొంత కష్టం అయ్యాయి.

 

ఎక్కువ మంది మూవీలో నార్త్ నటులు ఉన్నారు కదా ?

అవును పాత్రల కోసం కొందరిని ఎంపిక చేసాము. అయితే మూవీలో ఎవరి పాత్రకు వారే డబ్బింగ్ చెప్పుకున్నారు.

 

ఫైనల్ గా ది ఘోస్ట్ ఎలా ఉండబోతోంది ?

మంచి హై ఎమోషన్స్ తో సాగె మంచి హీరోయిజం ఎలివేట్ చేసే మూవీ ఇది. గూస్ బంప్స్ మూమెంట్స్ తో పాటు విజిల్ వేసే సన్నివేశాలు కూడా ఉంటాయి. అలానే ఒకరకంగా చెప్పాలి అంటే పక్కాగా సాగె మాస్ అంశాలతో తెరకెక్కిన క్లాస్ మూవీ ఇది. తప్పకుండా రిలీజ్ తరువాత ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు అనే నమ్మకం ఉంది.

 

కోవిడ్ తరువాత ప్రేక్షకుల అభిరుచి మారిందంటున్నారు, ఇటువంటి స్టోరీస్ రాసేటపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ?

నిజానికి కోవిడ్ వలన మనకు చాలా మేలు జరిగిందని నేను అంటాను. మంచి క్వాలిటీ గల సినిమాలు ఎలా ఉండాలో ప్రేక్షకులకి తెలిసింది. అలానే వారు పలు భాషల దేశాల సినిమాలు చూడడం అలవాటు పడ్డారు. మనం తీసే సినిమా వారి ఫోన్స్ లో కాకుండా వారు థియేటర్స్ కి వచ్చి చూసే భావన వారిలో కల్గించాలి. నాకు తెలిసి సినిమా తీయడం అనేది పుస్తకంలో ఒక పేజీ రాయడం వంటిది. ఒక వెయ్యేళ్ళు గడిచినా ది ఘోస్ట్ మూవీ అనే పేజీ ఉంటుంది. ఆ విధంగా ప్రేక్షకుల మదిలో నిలిచేలా ప్రతి అక్షరాన్ని ఎంతో ఆచితూచి రాయాలి అనే భయం ఉండాలి.

 

అయితే అక్టోబర్ 5 న చిరంజీవి గారి గాడ్ ఫాదర్ కూడా రిలీజ్ అవుతోంది కదా ? రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర క్లాష్ అవుతాయని భావిస్తున్నారా ?

అదేమి లేదండి, తప్పకుండా సినిమా బావుంటే ప్రేక్షకులు రెండూ ఆదరిస్తారు. ఇందులో ప్రత్యేకంగా ఎవరి మధ్య పోటీ లేదు.

 

మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి ?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారితో సినిమా అక్టోబర్ 10 నుండి యూకే లో మొదలౌతుంది. ఒక వెబ్ సిరిస్ ప్లాన్ కూడా వుంది. ఆ వివరాలు త్వరలోనే చెప్తాను.

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు