నందమూరి తారక రత్న ఈ మధ్యనే ఎన్.టి.ఆర్. గా పేరు మార్చుకున్న ఈ నటుడు సంక్రాంతికి “నందీశ్వరుడు” చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శబ్దాలయ స్టూడియోస్ కి వచ్చిన తారక రత్న తో మేము మాట్లాడాం ఆ విశేషాలు మీకోసం
ప్ర) నందీశ్వరుడు చిత్రం లో శక్తివంతమయిన పాత్రలో కనిపించబోతున్నారు కదా ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారు?
ఆ నిర్ణయం పూర్తిగా దర్శకునిదే ఈ చిత్రం లో నేను రెండు రకములయిన పాత్రలలో కనిపించాబోతున్నాను సింహ చిత్రం లో బాలయ్య బాబాయి చేసిన పాత్ర కూడా కాస్త స్ఫూర్తి ని ఇచ్చింది.
ప్ర) ఈ చిత్రం లో మీ పాత్ర గురించి చెప్పండి?
నా పాత్ర చాల విబిన్నంగా వుంటుంది మొదటి భాగం లో నేను విద్యార్థిగా కనిపిస్తాను అల్లరి చిల్లరిగా తిరిగే అతను చివరిగా జైలు కి కూడా వెళ్ళవలసి వస్తుంది అలాంటప్పుడు తన చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడుకోడానికి రెండవ అర్ధం లో శక్తీ వంతమయిన పాత్రగా మారుతాను. సుమన్ మరియు సీత నా తల్లితండ్రులుగా నటిస్తున్నారు.
ప్ర)ఈ చిత్రం మీద మీకున్న అంచనాలు?
ఈ చిత్రం 100 శాతం కమ్మర్షియల్ చిత్రం ఈ చిత్రం లో ప్రతి వర్గానికి ఏదో ఒకటి ఉంటుంది. ఈ చిత్రాన్ని చుసిన ఏ ఒక్కరు నిరాశ చెందరు. ఏ అంచనా లేకుండా చిత్రాన్ని చుసిన వారికి మంచి అనుభూతి అని యాక్షన్,కామెడీ,సెంటిమెంట్ జనం కి ఏది కావాలో అన్ని అంశాలు ఉన్నాయి
ప్ర).మీ ప్రతిభ ని పక్కన పెడితే మీకు బాక్స్ ఆఫీసు వద్ద ఇంతవరకు ఒక్క విజయం కూడా లేదు కారణం ఏంటంటారు?
గతం లో నాలో చాలా తప్పులు వుండేది అప్పట్లో చాలా ఎదగాలి ఇప్పుడు నేర్చుకున్నాను కాస్త ధీమాగా కూడా వున్నాను దర్శకుడు రవిబాబు దర్శకుడి నటుడు అని నన్ని అన్నందుకు కృతజ్ఞతలు.
ప్ర)రవిబాబు గురించి మాట్లాడారు కాబట్టి ఈ ప్రశ్న అమరావతి లో మీ నటన అద్బుతం మళ్ళి ప్రతినాయిక పాత్రలు చేసే ఆలోచన ఏమయినా వుందా?
అమరావతి చిత్రం వల్ల నాకు చాల ప్రశంశలు వచ్చాయి . ఆ చిత్రం లో నేను చేసిన పాత్ర ప్రతినాయిక పాత్ర కాదు ప్రతినాయక ఛాయలున్న పాత్ర. అలాంటి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తాను.
ప్ర)అసలు నందీశ్వరుడు అనే చిత్రం ఎలా మొదలయ్యింది?
దర్శకుడు నాతో చాల సంవత్సరాలు ఉన్నారు. తను ఈ చిత్ర కథను మొత్తం స్క్రిప్ట్ ను నాకు ఇచ్చారు చదివాక వెంటనే ఒప్పుకున్నాను. ఈ చిత్రాన్ని నాతోనే చెయ్యాలని ఇంకొక హీరో తో చెయ్యకూడదని దర్శకుడు చాలా రోజులు వేచి చూసారు.
ప్ర)సంక్రాంతి కి భారి చిత్రాలు విడుదలవుతున్నాయి పోటీని మీ చిత్రం తట్టుకోగలదా ?
ఖచ్చితంగా మా చిత్రం కూడా కమ్మర్షియల్ చిత్రం కాబట్టి ఎన్ని చిత్రాలు పోటిలో వున్నా మా చిత్రం విజయం సాదిస్తుంది.
ప్ర) రాజమౌళి ,వి.వి.వినాయక్ వంటి దర్శకులతో ఎప్పుడు చేస్తారు?
ముందు నన్ని నేను మంచి నటుడిగా నిరూపించుకోవాలి వాళ్ళు నన్ని నమ్మి చిత్రాలు తీయాలి అప్పుడు వాళ్ళతో చేస్తాను ఖచ్చితంగా పెద్ద దర్శకులతో భవిష్యతు లో చిత్రాలు చేస్తాను.
ప్ర) నందమూరి హీరోలతో కలిసి మల్టి స్టారర్ చిత్రాన్ని ఎప్పుడు చేస్తారు?
అలాంటి చిత్రం చెయ్యాలని నాకు ఉంది. కాని అలాంటి చితం చెయ్యాలంటే మంచి కథ కావాలి అందరి డేట్స్ కుదరాలి ఇలా చాల విషయాలు కుదరాలి. ఇప్పటికయితే ఎం అనుకోలేదు కాని భవిష్యత్తు లో ఖచ్చితంగా చేస్తా.
ప్ర)చిత్రం లో మీరు ఒక పాట పాడారు కదా ఆ అనుభవం ఎలా ఉంది?
ముందు నేను చాలా బయపడ్డాను కాని ఫలితం చూశాక చాల ఆనందమేసింది. చాలా మంది మెచ్చుకున్నారు కూడా అదొక ఆనందకరమయిన సంఘటన.
ప్ర)దగ్గర మనుషులు మరియు ఇష్టమయిన పనులు?
నాకు పరిశ్రమ లో చాల మంది స్నేహితులు ఉన్నారు తరుణ్, రాజీవ్ కనకాల, శ్రీకాంత్ ఇలా ఇంకా ఇష్టపడే పనులంటే నాకు క్రికెట్ ఆడటం అంటే చాల ఇష్టం సి.సి.ఎల్ కోసం కొద్ది గంటల్లో షార్జా బయలుదేరబోతున్నాను.
ప్ర)బవిష్యత్తు ప్రణాళికలు ?
అంజి శ్రీనుతోనే మరొక చిత్రం చెయ్యబోతున్నా ఈ చిత్రం నందీశ్వరుడు నుండి బిన్నంగా ఉండబోతుంది. కే.నాగేశ్వర రావు గారి దర్శకత్వం లో ఒక హాస్యప్రధాన చిత్రం చెయ్యబోతున్నా.
ప్ర)అభిమానులకి ఏదయినా సందేశం ?
అభిమానులకు నా కృతజ్ఞతలు. ముఖ్యంగా పవన్ మరియు సుజాన్ లకు మరీ చెప్పుకోవాలి నా విజయోపజయాలలో నాకు తోడుగా నిలిచారు ఈ సంవత్సరం నందమూరి వంశం తరుపున సంక్రాంతి కి నేను నిలబడడం చాల సంతోషంగా ఉంది.ఈ సరి నన్ని నేను నిరూపించుకుంటా.
ఇంతటితో ఇంటర్వ్యూ ముగించాము తారక్ రత్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకోడానికి వెళ్ళిపోయారు. నందీశ్వరుడు చిత్ర బృందానికి విజయం దక్కాలని 123 తెలుగు.అం తరుపున కోరుకుంటున్నాం.
గతం లో నాలో తప్పులు ఉండేవి -తారక రత్న
– అనువాదం రv