‘వాల్తేరు వీరయ్య’ ‘వీరసింహారెడ్డి’ లో ఫైట్స్ పవర్ఫుల్ గా ఉంటాయి – ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్

‘వాల్తేరు వీరయ్య’ ‘వీరసింహారెడ్డి’ లో ఫైట్స్ పవర్ఫుల్ గా ఉంటాయి – ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్

Published on Dec 31, 2022 11:15 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్సకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ మాస్ మూవీ వాల్తేరు వీరయ్య. ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ పవర్ఫుల్ మూవీ వీరసింహారెడ్డి. ఈ మూవీలో కూడా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ రెండిటినీ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి మూవీస్ నుండి రిలీజ్ అయిన సాంగ్స్ అందరినీ ఆకట్టుకుని ఆయా సినిమాల పై ఫ్యాన్స్, ఆడియన్స్ లో మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. సంక్రాంతి కానుకగా ఒక రోజు తేడాతో ప్రేక్షకాభిమానుల ముందుకి రానున్న ఈ మూవీస్ కి ఫైట్స్ కంపోజ్ చేసిన రామ్ లక్ష్మణ్ మాస్టర్ కొద్దిసేపటి క్రితం ఈ మూవీస్ గురించి తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు.

 

మీ యాక్షన్ ప్లాన్స్ ఎలా ఉంటాయి, ఏ విధంగా యాక్షన్ సీన్స్ సిద్ధం చేసుకుంటారు ?
ఒకసారి మూవీ కథ విన్న తరువాత ఇద్దరికీ సపరేట్ గా యాక్షన్ ప్లాన్స్ ఉంటాయి. అదృష్టం కొద్దీ మేము ఇద్దరం కావడంతో దర్శకుల దగ్గరకి మా ఇద్దరి ఆలోచనలతో వెళ్లడంతో ఫైనల్ గా ఒకటి సెట్ అవుతుంది.

 

మరి ప్రతి ఫైట్ కి కాన్సెప్ట్ ఉంటుంది కదా ? అది ఎలా డిజైన్ చేస్తారు ?
తప్పకుండా ఫైట్స్ కి కూడా కాన్సెప్ట్ అనేది ఉంటుంది, కాబట్టే ఆడియన్స్ ఇంకా పలు ఫైట్స్ ని ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. ముఖ్యంగా సినిమాల్లో కామెడీ, ఎంటర్టైన్మెంట్, యాక్షన్, ఎమోషన్ వంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా ఫైట్స్ బాగా డిజైన్ చేయగలిగితే ఆడియన్స్ అందరూ హ్యాపీగా చప్పట్లు, ఈలలు ,గోలలతో తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. సినిమాల్లో ఆయా హీరోల యొక్క బాడీ లాంగ్వేజ్ ని బట్టి ఫైట్స్ కంపోజ్ చేస్తాము. వీరసింహారెడ్డి విషయానికి వస్తే, అందులో ఒక ముఖ్య సీన్ లో బాలయ్య గారు కుర్చీలో కూర్చుని ఉంటారు, ఎదురుగా రౌడీలు పరుగెత్తుకుంటూ వస్తుంటారు, దానిని బట్టి ఆలోచించి, ఆయన నిలబడి కొట్టాలా లేదా కుర్చీలో కూర్చెనే స్టైలిష్ గా కొట్టవచ్చు కదా అనే ఆలోచన చేసాము. మొత్తంగా ఆ పవర్ఫుల్ సీన్ లో బాలయ్య గారు కుర్చీలో కూర్చుని అదిరిపోయే రేంజ్ లో ఫైట్ చేసేలా డిజైన్ చేసాము. సినిమాలో ఆ సీన్ అదిరిపోతుంది.

 

వీరసింహారెడ్డి కుర్చీ ఫైట్ మాదిరిగా వాల్తేరు వీరయ్య ఫైట్స్ కాన్సెప్ట్ చెప్పండి ?
వాల్తేరు వీరయ్య మూవీలో ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయే రేంజ్ లో చేసాము. అప్పటివరకు లుంగీ కట్టుకుని శ్రీకాకుళం యాసలో సరదాగా మాట్లాడుతూ ఉండే చిరంజీవి గారు హఠాత్తుగా గన్స్ పట్టుకుని స్టైలిష్ గా ఫైట్ చేయాలి, ఆ యాక్షన్ సీన్ ఎంతో అద్భుతంగా సిద్ధం చేసాము, చిరంజీవి గారు సూపర్ గా పెర్ఫార్మ్ చేసారు. అలానే ఈ మూవీలో చిరంజీవి గారు శృతి హాసన్ గారి మధ్య ఒక సరదాగా సాగె కామెడీ ఫైట్ ఉంటుంది, అది కూడా మీ అందరినీ ఆకట్టుకుంటుంది.

 

వాల్తేరు వీరయ్య ఇంటర్వెల్ ఎపిసోడ్ కి మీకు ఎంత టైం పట్టింది. ?
నిజానికి ఆ ఫైట్ రెడీ చేయడానికి మాకు మొత్తం 15 రోజులు పట్టింది. కంటెంట్ బాగున్నప్పుడు టైం గురించి పెద్దగా పట్టించుకోనవసరం లేదు. మూవీ కూడా అద్భుతంగా ఉంది, అలానే మేము చేసిన యాక్షన్ ఎపిసోడ్ మరింత సూపర్ గా వచ్చింది. నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ వారు మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చి ఖర్చుకి ఏ మాత్రం వెనుకాడకుండా మాతో చేయించుకున్నారు. తప్పకుండా మూవీ మంచి విజయం అందుకుంటుందని నమ్ముతున్నాం. అలానే వీరసింహారెడ్డి కూడా పెద్ద సక్సెస్ కొడుతుందని నమ్మకం ఉంది.

 

వీరసింహారెడ్డి లో ఇంటర్వెల్ ఫైట్ ఎలా ఉంటుంది ?
ఈ మూవీలో ఫైట్ సీన్ ఎంతో పవర్ఫుల్ గా గ్రాండ్ గా ఉంటుంది, అది మేము టర్కీ లో చేసాము. తప్పకుండా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు.

 

చిరంజీవి గారు, బాలకృష్ణ గారి అభిమానుల అంచనాలు అందుకునేలా ఈ రెండు సినిమాల్లో ఫైట్స్ కంపోజ్ చేసారా ?
నిజానికి ఈ రెండు కథలు ఎంతో బలమైన యక్షన్, ఎమోషన్ కలిగిన కథలు, ఇక వాటిలో హీరోల యొక్క పాత్రల ఆలోచనలకు తగ్గట్లుగా పవర్ఫుల్ ఫైట్ సీన్స్ కంపోజ్ చేసాము. ముఖ్యంగా ఈ సినిమాల దర్శకులైన గోపీచంద్ గారు, బాబీ గారు ఇద్దరి ఆలోచనలు ఎంతో అద్భుతంగా ఉంటాయి, ఇద్దరూ కూడా తమకి ఏమి కావాలో దగ్గరుండి మరీ చేయించుకున్నారు. తప్పకుండా అటు చిరంజీవి గారి అభిమానులు, ఇటు బాలకృష్ణ గారి అభిమానులు ఇద్దరూ కూడా ఈ రెండు సినిమాల ఫైట్స్ ఎంజాయ్ చేస్తారు.

 

ఈ రెండు సినిమాల్లో ఎమోషన్ ఎలా ఉంటుంది ?
ముందుగా వీరసింహారెడ్డి గురించి చెప్పుకుంటే ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ఎమోషనల్ సీన్ కి నిజంగా ప్రతి ఒక్కరి కంట నీరు తిరుగుతుంది. మేము కూడా విన్న వెంటనే కన్నీళ్లు ఆపుకోలేకపోయాము. వాల్తేరు వీరయ్య లో చిరంజీవి గారు, రవితేజ గారి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ హృదయానికి హత్తుకుంటాయి. తప్పకుండా అవి ఆయా సినిమాలకు మంచి బలంగా నిలవడంతో పాటు ప్రేక్షకుల మనసులు తాకుతాయి.

 

ఈ మధ్య సాంగ్స్ లో కూడా యాక్షన్ కంపోజ్ చేస్తున్నారు కదా, దీని పై మీ కామెంట్ ?
ఇది నిజానికి మంచి ట్రెండ్ అనే చెప్పాలి. పాటలకు యాక్షన్, ఫైట్స్ కంపోజ్ చేయడం ఒకింత సవాల్ గానే ఉంటుంది.

మీ ఇద్దరికీ ఆల్ ది బెస్ట్ … థాంక్యూ

సంబంధిత సమాచారం

తాజా వార్తలు