ముఖాముఖి : నిప్పు గుణశేఖర్ సినిమాలా ఉండదు – వై వి ఎస్ చౌదరి

ముఖాముఖి : నిప్పు గుణశేఖర్ సినిమాలా ఉండదు – వై వి ఎస్ చౌదరి

Published on Feb 2, 2012 3:26 PM IST

ప్రముఖ దర్శకుడు వైవిఎస్ చౌదరి నిర్మాతగా బొమ్మరిల్లు బ్యానర్ పై ఆయనే దర్శకుడిగా పలు చిత్రాలు తీసారు. మొట్టమొదటిసారిగా ఆయన నిర్మాతగా మరో దర్శకుడితో సినిమా తీసారు. రవితేజ హీరోగా గుణశేఖర్ డైరెక్షన్లో ‘నిప్పు అనే సినిమా ఆయన నిర్మించారు. ఈ సినిమా ఈ ఫిబ్రవరి 17న విడుదల కాబోతున్న సందర్భంగా ఆయన విలేఖరులతో ముచ్చటించారు. ఈ సినిమా గురించి మేము అడిగిన ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాధానాలు మీకోసం.

1. ప్ర: నిప్పు సినిమా మొదట్లో సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. ఇప్పుడు ఫిబ్రవరి 17న విడుదల చేయబోతున్నారు. ఇంత ఆలస్యం కావడానికి గల కారణం ఏంటి?
స: సంక్రాంతి సమయానికి సంగీత దర్శకుడు తమన్ 2, 3 సినిమాలతో బిజీగా ఉండటం, గుణశేఖర్ గారు నేను ఇద్దరంసినిమా విషయం ఎక్కడ రాజీ పడము. ఆ బిజీ సమయంలో తమన్ ను కంగారుపెట్టి రీ రికార్డింగ్ చేయించుకోవడం ఇష్టం లేదు. కొంత షూటింగ్ పార్ట్ కూడా మిగిలి ఉండటంతో విడుదల చేయడం కుదరలేదు. అలాగే ఫిబ్రవరి 2న కూడ విడుదల చేయలనుకున్నాము. పలు కారణాల వాళ్ళ కుదధరలేదు. చివరికి మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించాము.

2. ప్ర: గుణశేఖర్ సినిమా అంటే భారీతనం, సెట్లు, సీరియస్నెస్ ఉంటుంది. రవితేజ అంటే ప్రేక్షకులు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఆశిస్తారు, మారి ఈ సినిమా ఎవరి ఇమేజ్ కి తగ్గట్లు ఉంటుంది?
స: గుణశేఖర్ గారి ప్రతి సినిమాలో ఉండేవి ఏమీ ఉండవు ఆయన ఇమేజ్ ని బ్రేక్ చేస్తూ రవితేజ స్త్తాయిలో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. రవి తేజ అభిమానులని ఏ మాత్రం నిరాశ పరచకుండా ఉంటుంది. గుణశేఖర్ సినిమాలా ఉంటుందని ఆశించి వచ్చిన ప్రేక్షకుడు మాత్రం ఖచ్చితంగా షాక్ గురవుతాడు.

3. ప్ర: మీ గత చిత్రాలు చూస్తే దాదాపుగా అన్నీ మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. ఈ సినిమాలో ఆడియో ఏ స్థాయిలో ఉంది? పాటల చిత్రీకరణ గురించి చెప్పండి?
స: నాకు చిన్నప్పటినుండే సంగీతం అంటే చాలా ఇష్టం. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు చక్రవర్తి, ఇళయరాజా, రాజ్-కోటి మరియు కీరవాణి వంటి గొప్ప సంగీత దర్శకులతో పని చేశాను. దర్శకుడిగా కూడా ఎంతో మంది సంగీత దర్శకులతో పనిచేసాను. నాకు నచ్చిన కీరవాణి గారి దగ్గర ఎంతో నేర్చుకున్నాను. ఈ సినిమాకి మాత్రం నేను 6 పాటలు గుణశేఖర్ గారికే వదిలేసాను. రెగ్యులర్ గా రవితేజ పాటల్లో ఉండే కిక్కు గుణశేఖర్ స్టైల్లో చిత్రీకరణ ఉంటుంది.

4. ప్ర: ఈ సినిమాలో హైలెట్స్ గురించి చెప్పండి?
స: గుణశేఖర్ గారు 9 నెలలు స్క్రిప్ట్ మీద దృష్టి పెట్టి పక్కగా సినిమా మొదలు పెట్టారు. రవితేజ ఎనర్జీ, నలుగురు కొరియోగ్రఫీలో చిత్రీకరించిన 6 పాటలు, కనల్ కన్నన్ అధ్వర్యంలో తీసిన 6 ఫైట్లు మాస్ ప్రేక్షకులను అలరిస్తాయి. అలాగే శ్రీరామ్ మరియు భావన ప్రత్యేక పాత్రలో నటించారు. నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు కూడా కీలక పాత్ర పోషించారు. తప్పకుండా ప్రతీ ఒక్క ప్రేక్షకుడిని అలరిస్తుందన్న నమ్మకం నాకుంది.అలాగే శ్రీధర్ సీపాన గారు రాసిన పంచ్ డైలాగులు కూడా అలరిస్తాయి.

5. ప్ర: నిప్పు సినిమాలో రవితేజ పాత్ర ఎలా ఉంటుంది?
స: ఇందులో హీరో పాత్ర పేరు ‘సూర్య’. అతని పేరులోనే ఫైర్ ఉంది. ఎప్పుడు అల్లరి చిల్లరిగా తిరుగుతుంటాడు. ఈసారి ఒక భాద్యత కూడా ఉంటుంది. ఈ టైపులో హీరో పాత్ర ఉంటుంది.మీరు తెర మీద చూసినపుడు ఇంకా థ్రిల్ కి గురవుతారు.

6. ప్ర: ఈ మద్య వస్తున్న సినిమాలలో హీరొయిన్ కి పెద్దగా పాత్ర లేకుండా పాటల వరకే పరిమితమవుతున్నారు. మారి ఈ సినిమాలో దీక్షా సేథ్ పాత్ర ఎంత వరకు ఉంది?
స: దీక్షా సేథ్ చేసిన అన్ని సినిమాల కంటే ఈ సినిమా ఆమెకి మంచి పేరు తీసుకువస్తుంది. కొన్ని సినిమాలలో సెకండ్ హీరొయిన్ గా చేసింది. ఈ సినిమాలో సింగిల్ హీరొయిన్ గా ఆమె మంచి పెర్ఫార్మెన్స్ చేసింది.

అశోక్ రెడ్డి. యమ్

సంబంధిత సమాచారం

తాజా వార్తలు