అమెరికాలో ‘శ్రీ రామ రాజ్యం’ టికెట్ 6000 డాలర్లు


తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హీరోల్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు, వీరాభిమనులున్న వారిలో బాలయ్య ఒకరు. ఈ అభిమానం శ్రీ రామ రాజ్యం సినిమా తో కొత్త పుంతలు తొక్కుతోంది.

అమెరికాలో ఈ సినిమా టికెట్ లకు డిమాండ్ విపరీతంగా పెరిగి పోయింది. కనీవినీ ఎరుగని రేట్లకు ఈ మూవీ టికెట్స్ అమ్ముడవుతున్నాయని తెలియవచ్చింది. శాన్ జోస్ లో అశోక్ అనే అభిమాని ఈ సినిమా ప్రీమియర్ షో టికెట్ 2500 అమెరికన్ డాలర్లకు కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఇలాంటిదే మరో సంఘటన న్యూ జెర్సీ లో చోటు చేసుకుంది. మరో తెలుగు వ్యక్తి ఈ సినిమా ప్రీమియర్ షో టికెట్ ను ఏకంగా 6000 డాలర్లు వెచ్చించి చేజిక్కిన్చుకోవటం మరో గొప్ప విషయం.

శ్రీ రామ రాజ్యం సినిమా టికెట్లు ఈ తరహా మొత్తాల్లో అమ్ముడవటం బాలయ్య స్టామినాకు అద్దంపడుతున్నాయి. ఈ చిత్రానికి బాపు దర్శకత్వం వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version