‘ఆయ్’… రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారుగా!

‘ఆయ్’… రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారుగా!

Published on Jun 25, 2024 11:33 AM IST

యంగ్ హీరో నితిన్ నార్నె న‌టిస్తున్న తాజా చిత్రం ‘ఆయ్’ ఇప్పటికే ప్రేక్ష‌కుల్లో మంచి బ‌జ్ ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను GA2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మాత బ‌న్నీ వాస్ ప్రొడ్యూస్ చేస్తుండ‌టంతో ఈ మూవీపై అంచ‌నాలు మరింత‌గా పెరిగాయి.

కాగా, ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ను మేక‌ర్స్ తాజాగా వెల్ల‌డించారు. ‘ఆయ్’ చిత్రాన్ని ఆగ‌స్టు 15న థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో ఆగ‌స్టు 15న బాక్సాఫీస్ వ‌ద్ద మ‌రోసారి గ‌ట్టి పోటీ న‌డ‌వనుంది. ఇప్ప‌టికే ఈ డేట్ ను ప‌లు సినిమాలు లాక్ చేసుకున్నాయి.

ఇక ‘ఆయ్’ సినిమాలో న‌య‌న్ సారిక హీరోయిన్ గా న‌టిస్తోండ‌గా రామ్ మిర్యాల ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. సమీర్ కళ్యాణి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ‘ఆయ్’ సినిమాను అంజి కె.మ‌ణిపుత్ర డైరెక్ట్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు