‘కల్కి 2898 AD’లో ఒరిజినల్ మాస్ హీరో – నాగ్

‘కల్కి 2898 AD’లో ఒరిజినల్ మాస్ హీరో – నాగ్

Published on Oct 28, 2024 8:01 PM IST

దివంగత లెజెండరీ యాక్టర్ డా.అక్కినేని నాగేశ్వర రావు నేషనల్ అవార్డ్ ప్రధానోత్స కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. 2024 సంవత్సరానికి గాను ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డ్‌ని మెగాస్టార్ చిరంజీవికి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, నేడు ఈ అవార్డ్ ప్రధానోత్సవాన్ని తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖుల సమక్షంలో మెగాస్టార్ చిరంజీవికి బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అందించారు.

ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేసిన అమితాబ్ బచ్చన్ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ఆయన అమితాబ్ బచ్చన్ సినిమాలు చూస్తూ పెరిగానని.. రీసెంట్‌గా వచ్చిన ‘కల్కి 2898 AD’లో అమితాబ్ బచ్చన్ నటన చూసి ఆయనకు ఫోన్ చేశానని.. మా ఒరిజినల్ మాస్ హీరో తిరిగి వచ్చారు.. అంటూ ఆయనకు ఫోన్ చేసిన చెప్పానని నాగార్జున చెప్పుకొచ్చాడు.

తనకు ఎంతో ఇష్టమైన అమితాబ్ బచ్చన్‌ను ఇలా ‘కల్కి’ లాంటి సినిమాలో చూడటంతో అమితాబ్‌కి చెందిన పలు సినిమాలు తనకు గుర్తుకు వచ్చాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఇలా అమితాబ్‌పై తన అభిమానాన్ని నాగ్ మరోసారి చాటుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు