డ‌ల్లాస్‌లో మీ ప్రేమాభిమానాలు చూస్తుంటే మాటలు రావటం లేదు – ఆత్మీయ స‌మ్మేళనంలో రామ్ చ‌ర‌ణ్‌

డ‌ల్లాస్‌లో మీ ప్రేమాభిమానాలు చూస్తుంటే మాటలు రావటం లేదు – ఆత్మీయ స‌మ్మేళనంలో రామ్ చ‌ర‌ణ్‌

Published on Dec 22, 2024 7:20 AM IST

రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వాణీ, స్టార్ డైరెక్ట‌ర్‌ ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ‘గేమ్ చేంజ‌ర్‌’. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. డిసెంబ‌ర్ 21న యు.ఎస్‌లోని డ‌ల్లాస్‌లో గేమ్ చేంజ‌ర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ లెవ‌ల్లో నిర్వ‌హిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అభిమానుల‌తో జ‌రిగిన ఆత్మీయ స‌మ్మేళనంలో రామ్ చ‌ర‌ణ్‌, దిల్ రాజు, శిరీష్, చరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లి త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా…

రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ ‘‘డల్లాస్‌లోని అభిమానుల‌కు ప్ర‌త్యేక‌మైన కృత‌జ్ఞ‌త‌లు. ఇక్క‌డి వారి చూపించిన ప్రేమాభిమానాల‌తో మాట‌లు కూడా రావ‌టం లేదు. మమ్మ‌ల్ని రిసీవ్ చేసుకున్న తీరు చూసి ఆశ్చ‌ర్య‌పోయాను. ఆంధ్ర‌, తెలంగాణ‌ల్లో ఉన్నామా! లేక డ‌ల్లాస్ వ‌చ్చామా! అని కూడా అర్థం కావ‌టం లేదు. ల‌వ్ యు ఆల్‌. అంద‌రూ నాపై ప్రేమ‌తో ఇక్క‌డ‌కు వ‌చ్చినందుకు థాంక్స్‌. ఓవ‌ర్‌సీస్‌లోని ప్ర‌జ‌లే ముందుగా సినిమాను చూస్తారు. ఇక్క‌డ నుంచే ప్ర‌మోష‌న్స్‌ను మొదలు పెడుతున్నాం. మా ‘గేమ్ చేంజ‌ర్‌’కు మీ అంద‌రి ఆశీస్సులు మాకు కావాలి. దిల్‌రాజుగారికి, శిరీష్‌గారికి థాంక్స్‌. ఇంత పెద్ద ఈవెంట్‌ను ఘ‌నంగా నిర్వ‌హించిన రాజేష్ క‌ల్లెప‌ల్లి అండ్ టీమ్‌కు స్పెష‌ల్ థాంక్స్‌. జ‌న‌వ‌రి 10న రిలీజ్ అవుతోన్న ‘గేమ్ ఛేంజ‌ర్‌’ను చూసి ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు