నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “అర్జున్ సన్నాఫ్ వైజయంతి”. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ పవర్‌ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. టీజర్ ఆద్యంతం వైల్డ్ రైడ్‌గా సాగింది. టీజర్ లో యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషనల్ మూమెంట్స్ ను కూడా చాలా బాగా కట్ చేశారు. అభిమానులు కళ్యాణ్ రామ్ ను ఎలాగైతే చూడాలని అనుకుంటారో, దర్శకుడు అలాగే ప్రెజంట్ చేశాడు. ఇక వింటేజ్ లుక్స్‌లో విజయశాంతిని చూసి ఆమె అభిమానులు థ్రిల్ ఫీల్ అవుతున్నారు.
ముఖ్యంగా టీజర్ లో తల్లీకొడుకుల మధ్య డ్రామా తాలూకు ఎస్టాబ్లిష్ షాట్స్ ను చాలా బాగా కట్ చేశారు. మొత్తానికి ఈ టీజర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ సహా అశోక క్రియేషన్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు. అలాగే, ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి.