వన్ మిలియన్ రీల్స్ తో “చుట్టమల్లే”

వన్ మిలియన్ రీల్స్ తో “చుట్టమల్లే”

Published on Sep 15, 2024 2:44 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన దేవర చిత్రం ఈ నెల 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలు, పాటలు బాగా అలరిస్తున్నాయి. చుట్టమల్లే సాంగ్ ఇప్పటికే భారీ వ్యూస్ తో దూసుకు పోతుండగా, ఈ పాట మరో రికార్డు ను క్రియేట్ చేసింది.

ఈ పాటకి సోషల్ మీడియాలో 1 మిలియన్ కి పైగా రీల్స్ వచ్చాయి. అదే విషయాన్ని మేకర్స్ తాజాగా వెల్లడించారు. స్టార్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో సైఫ్ అలీఖాన్, ప్రకాష్ రాజ్, అజయ్, శ్రీకాంత్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ల పై నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవి చందర్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు