టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఖుషీ. ఈ చిత్రం కి సంబందించిన ట్రైలర్ ను నిన్న మేకర్స్ తెలుగు తో పాటుగా, భారతీయ ప్రధాన బాషల్లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ ట్రైలర్ కి ఆడియెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
తెలుగు లో ట్రైలర్ 10 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ట్రైలర్ యూ ట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. జయరామ్, సచిన్ ఖేదేఖర్, మురళి శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి హేషం అబ్ధుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 1, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.