100 రోజుల్లో థియేటర్ల లోకి”దేవర”

100 రోజుల్లో థియేటర్ల లోకి”దేవర”

Published on Dec 27, 2023 5:00 PM IST

గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఇప్పటికే ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం మరో 100 రోజుల్లో థియేటర్ల లోకి రానుంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ చిత్రం లో మునుపెన్నడూ కనిపించని గెటప్ లో ఆడియన్స్ ను అలరించనున్నారు. ఈ చిత్రం లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రాక్ స్టార్ అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు