నందమూరి నటసింహం, బాలకృష్ణ ఒక పక్క హీరోగా వరుస సినిమాలు చేస్తూనే, ఆహా వీడియో లో మాస్ ప్రోగ్రాం అయిన అన్ స్టాపబుల్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమం రెండవ సీజన్ చాలా గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. ఈ కార్యక్రమం కి అతిథి గా వచ్చిన మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో, ప్రేక్షకులతో పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఎపిసొడ్ ఆహా వీడియో లో స్ట్రీమ్ అవుతోంది.
అయితే ఈ గ్రాండ్ ఎపిసొడ్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ ఎపిసోడ్ కు ఇప్పటి వరకూ 100 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ వ్యూస్ రావడం విశేషం. ఇది బాలయ్య సిసలైన మాస్ పవర్ అని చెప్పాలి. ఈ సెలబ్రిటీ టాక్ షో కి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. రానున్న రోజుల్లో టాలీవుడ్ కి సంబంధించిన కీలక హీరోలు సైతం ఈ కార్యక్రమం లో పాల్గొననున్నారు.