మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్’ దీపావళి కానుకగా రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి డ్రామా థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. ఇక ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే, ఈ సినిమాను అక్టోబర్ 31న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తుండటంతో ఈ చిత్రానికి ప్రీమియర్ షోలు వేస్తామని నిర్మాత నాగవంశీ గతంలోనే వెల్లడించాడు. ఆయన చెప్పినట్లుగానే ‘లక్కీ భాస్కర్’ భాస్కర్ చిత్రాన్ని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ప్రీమియర్ షోలు వేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 100కి పైగా ప్రీమియర్ షోలను అక్టోబర్ 30న సాయంత్రం 6 గంటల నుండి వేయన్నట్లు మేకర్స్ వెల్లడించారు.
దీంతో ‘లక్కీ భాస్కర్’ చిత్ర ప్రీమియర్లకు భారీ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, మ్యూజిక్ డైరెక్టర్ జివి.ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.