ఏఎన్నార్ లెగసీకి నూరు వసంతాలు..

మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర అనేకమంది దిగ్గజ నటీనటులు ఉండొచ్చు కానీ తెలుగు సినిమా అంటే మొదటి గుంటచే రెండు పేర్లలో తప్పకుండా వినిపించే పేరే అక్కినేని నాగేశ్వరరావు. మరి తెలుగు సినిమాకి తన అపారమైన సేవలు అందించడమే కాకుండా తన ఎనర్జీతో అసలు ముందు తరాలకే ఒక ఎనర్జిటిక్ బుక్ లా మారారు. మరి తన తుది శ్వాస వరకు సినిమాతోనే కొనసాగిన ఏఎన్నార్ గారి కీర్తి తెలుగు సినిమానే కాకుండా భారతీయ సినిమా కూడా మరువలేనిది.

టాలీవుడ్ లో ఎలాంటి జానర్ పాత్రల్లో అయినా ఇమిడిపోయే ఈ దిగ్గజ నటులు ఎన్నెన్నో సంచలన విజయాల్ని తెలుగు సినిమాకి అందించారు. మరి నేటితో ఏఎన్నార్ గారు జన్మించి 100వ ఏడాది కావడంతో మరొక్క సారి తెలుగు సినిమా ప్రముఖులు అలాగే అక్కినేని కుటుంబం ఆయన లెగసీని మరోసారి స్మరించుకుంటున్నారు. మరి తెలుగు సినిమా ఉన్నంత కాలం అక్కినేని నాగేశ్వరరావు గారి కీర్తి ప్రతిష్టలు కొనసాగుతాయని చెప్పొచ్చు.

Exit mobile version