ప్రీమియర్ షోలతోనే విధ్వంసం సృష్టించిన “కల్కి”

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, పాన్ వరల్డ్ హీరోగా కల్కి చిత్రంతో మారిపోయాడు అని చెప్పాలి. ఈ చిత్రం పై ఉన్న క్రేజ్ అలాంటిది. సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుండే విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రం జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లోకి రానుంది. జూన్ 26 వ తేదీన నార్త్ అమెరికా లో ప్రీమియర్ షోలు పడనున్నాయి. అయితే ఈ షోలకి ఇప్పుడు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

ఇప్పటి వరకూ ప్రీమియర్ షో లకు లక్ష టికెట్లు అమ్ముడు పోయాయి. ఇది సెన్సేషన్ రెస్పాన్స్ అని చెప్పాలి. ప్రీమియర్ షోలు స్టార్ట్ కావడానికి ముందుగా, ఈ చిత్రం ఇంకెలాంటి రికార్డు లను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ చిత్రం లో దీపికా పదుకునే, దిశా పటాని, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version