సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ కు దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. నిన్న ఈ సినిమా నుండి కుర్చీ మడతపెట్టి పాటను రిలీజ్ చేయగా, సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
ఈ పాటకి ఇప్పటి వరకూ 11 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. యూ ట్యూబ్ లో ప్రస్తుతం ఈ పాట టాప్ లో ట్రెండ్ అవుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు హీరోయిన్ శ్రీ లీల మాస్ డాన్స్ ఆడియన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.