15 మిలియన్ వ్యూస్ తో “ఫ్యామిలీ స్టార్” గ్లింప్స్

15 మిలియన్ వ్యూస్ తో “ఫ్యామిలీ స్టార్” గ్లింప్స్

Published on Oct 21, 2023 12:07 AM IST


యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ స్టార్. ఈ చిత్రం టైటిల్ ను రివీల్ చేస్తూ, మేకర్స్ గ్లింప్స్ వీడియో ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియో కి ఆడియెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకూ కూడా ఈ వీడియో 15 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం యూట్యూబ్ కో ట్రెండ్ అవుతోంది.

గీతా గోవిందం చిత్రం తరువాత విజయ్, పరశురామ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు