ఇటీవల కార్తికేయ 2 వంటి బ్లాక్ బస్టర్ మూవీతో నటుడిగా మంచి పేరుని సూపర్ డూపర్ హిట్ ని సొంతం చేసుకున్న నిఖిల్ సిద్దార్థ ప్రస్తుతం నటిస్తున్న మూవీ 18 పేజెస్. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలపై సంయుక్తంగా నిర్మితం అవ్వగా ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, పోస్టర్స్ ఇలా అన్ని కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుని మూవి పై మంచి అంచనాలు ఏర్పరిచాయి.
కాగా నేడు కొద్దిసేపటి క్రితం 18 పేజెస్ థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ఇక ట్రైలర్ ఆద్యంతం లవ్, రొమాంటిక్, యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో కొనసాగింది. చూడబోతే ఈ మూవీలో లవ్ తో పాటు మంచి థ్రిల్లింగ్ అంశాలు కూడా మూవీ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా కనపడుతున్నాయి. నిఖిల్ ఫ్రెష్ లుక్స్, అనుపమ పరమేశ్వరన్ అందం, అభినయం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ తో పాటు ముఖ్యంగా ట్రైలర్ లో ‘మనం ఎవరిని అయినా ప్రేమిస్తున్నాం అంటే దానికి రీజన్ ఉండకూడదు, అలానే ఎందుకు ప్రేమిస్తున్నాం అంటే దానికి ఆన్సర్ ఉండకూడదు’ వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.
మొత్తంగా ఆకట్టుకునే విధంగా సాగిన 18 పేజెస్ ట్రైలర్ మూవీ పై ఆడియన్స్ లో బాగా ఆసక్తిని రేకెత్తించిందనే చెప్పాలి. పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించిన ఈ మూవీకి గోపిసుందర్ సంగీతం అందించగా బన్నీవాసు ఈ మూవీని గ్రాండ్ గా నిర్మించారు. కాగా ఈ మూవీ డిసెంబర్ 23న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.