ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర పాన్ ఇండియా మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది రెబల్ స్టార్ ప్రభాస్ అనే చెప్పాలి. తన స్టార్డంని అదే మోతాదులో మైంటైన్ చేస్తూ తెలుగు సహా హిందీ ఇంకా ఓవర్సీస్ మార్కెట్ లో ప్రభాస్ మంచి మార్కెట్ మైంటైన్ చేస్తూ వస్తున్నాడు.
దానికి తగ్గట్టుగానే తన లైనప్ కూడా మరింత లెవెల్లోకి వెళుతుండగా ఇపుడు మరోసారి డార్లింగ్ హీరో పేరు సెన్సేషన్ గా మారింది. సోషల్ మీడియాలో ఇపుడు ప్రభాస్ లైనప్ పై మరోసారి చర్చ స్టార్ట్ అవుతుంది. అయితే ఆల్రెడీ చాలా మంది దర్శకులు ప్రభాస్ తో వర్కుక్ చేస్తున్నప్పటికీ ఇపుడు ఓ ఇద్దరు యువ దర్శకుల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.
వారే కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ అలాగే మన టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ ఇద్దరి పేర్లు ప్రభాస్ లైనప్ లో చేరనున్నాయి అంటూ క్రేజీ టాక్ ఇపుడు వైరల్ గా మారింది. మరి ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లపై త్వరలోనే ఓ క్లారిటీ కూడా రానుంది అంటూ పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి చూడాలి ఎపుడు వీటిపై ప్రకటన వస్తుంది అనేది.