2021 సంక్రాంతికి స్టార్ హీరోలు వస్తారా?

Published on Jul 11, 2020 1:00 am IST

కరోనా వైరస్ కారణంగా టాలీవుడ్ స్టార్ హీరోలందరూ షూటింగ్స్ కి దూరంగా ఉంటున్నారు. లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో ఎవరూ షూటింగ్స్ మొదలుపెట్టలేదు. సీనియర్ స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు సైతం షూటింగ్ అంటే ససేమిరా అంటున్నారని సమాచారం. కరోనా వైరస్ ఉధృతి ఇప్పట్లో తగ్గేలా లేదు. వాక్సిన్ వస్తే తప్ప కరోనా వైరస్ ని కట్టడి చేయలేమని, ప్రభుత్వాలు మరియు ప్రజల ఉద్దేశంగా ఉంది. కొందరైతే 2021 వరకు షూటింగ్స్ జరగకపోవచ్చని అంటున్నారు.

మరి ఇదే జరిగితే 2021 సంక్రాంతి సీజన్ బోసి పోనుంది. ఒక్క స్టార్ హీరో మూవీ కూడా సంక్రాంతికి విడుదల కాకపోవచ్చు. ఆర్ ఆర్ ఆర్ సంక్రాంతికి వస్తున్నట్లు ప్రకటించినా, అది సాధ్యం కాదని తేలిపోయింది. ఇక ప్రభాస్, బన్నీ, మహేష్ సైతం తమ చిత్రాల విడుదల సంక్రాంతికి చేయలేని పరిస్థితి ఉంది. కనీసం రెండు నెలల తరువాతైనా సాధారణ పరిస్థితులు ఏర్పడితే బాలయ్య, చిరు మరియు పవన్ కళ్యాణ్ సంక్రాంతి బరిలో దిగే అవకాశం ఉంటుంది. లేదంటే 2021 సంక్రాంతి చప్పగా ముగుస్తుంది.

సంబంధిత సమాచారం :

More