ఒకప్పుడు అయితే టికెట్స్ కోసం థియేటర్స్ దగ్గర జనం బారులు తీరేవారు కానీ మారుతున్న కాలంతో దీనికి కూడా ప్రత్నామ్యాయాలు చాలా వచ్చేసాయి. ఇలా టికెట్స్ కోసం పలు బుకింగ్ యాప్స్ రాగ వాటిలో బుక్ మై షో కూడా ఒకటి. అయితే ఓ సినిమా కోసం చూడాలి అంటే దాదాపు ఇందులోనే జనం మొదట వెతుకుతారు. అలా ఈ ఏడాదిలో చాలా చిత్రాలు బుక్ మై షోలో భారీ మొత్తంలో టికెట్స్ అమ్ముడుపోయాయి. అయితే లేటెస్ట్ గా బుక్ మై షో వారు ఈ 2024 ఏడాదిలో తమ బెస్ట్ టాప్ 10 సినిమాలు లిస్ట్ అందించారు. మరి ఈ లిస్ట్ చూసినట్టు అయితే..
1. కల్కి 2898 ఎడి
2. స్త్రీ 2
3. పుష్ప 2
4. హను మాన్
5. అమరన్
6. భూల్ భూలైయా 3
7. దేవర పార్ట్ 1
8. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం
9. మంజుమ్మెల్ బాయ్స్
10. సింగం అగైన్
ఇక ఈ టోటల్ లిస్ట్ మన తెలుగు సినిమాలే నాలుగు ఉండడం విశేషం. ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి, లేటెస్ట్ సెన్సేషన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 అలాగే తేజ సజ్జ నటించిన హను మాన్ అలాగే మ్యాన్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాలు నిలిచాయి. మిగతా 6 స్థానాల్లో మూడు సినిమాలు హిందీ, రెండిట్లో తమిళ్, ఒక స్థానంలో మళయాళ సినిమా నిలిచింది. మరి ఇంట్రెస్టింగ్ గా మన తెలుగు సినిమాలు నాలుగు కూడా అన్నీ సీక్వెల్ ఉన్న సినిమాలే కావడం గమనార్హం.