2026లో మైత్రి నుంచి రాబోతున్న బ్లాక్‌బస్టర్స్ ఇవే!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. మీడియం బడ్జెట్ చిత్రాలతో పాటు భారీ బడ్జెట్ చిత్రాలను లైన్‌లో పెట్టిన ఈ ప్రొడక్షన్ కంపెనీ రాబోయే 2026లో పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెరకెక్కిస్తుంది. తాజాగా ఈ చిత్రాలపై నిర్మాత రవి శంకర్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

తాజాగా జరిగి రాబిన్‌హుడ్ మూవ ప్రెస్ మీట్‌లో రవి శంకర్ మాట్లాడారు. ఇక 2026లో తమ బ్యానర్ నుంచి రాబోతున్న చిత్రాలు ‘జై హనుమాన్’, RC16, హను రాఘవపూడి ప్రభాస్ మూవీ, ఎన్టీఆర్-నీల్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక ఈ నాలుగు చిత్రాలు ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్స్ అవుతాయని ఆయన కాన్ఫిడెంట్‌గా చెప్పుకొచ్చారు.

ఇక ఆయన ఈ నాలుగు సినిమాలపై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచడంతో ఈ సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version