చిరు ఇండస్ట్రీ హిట్ కి 22 ఏళ్ళు.. “ఇంద్ర” లో ఇంట్రెస్టింగ్ మిస్టేక్ తెలుసా?

చిరు ఇండస్ట్రీ హిట్ కి 22 ఏళ్ళు.. “ఇంద్ర” లో ఇంట్రెస్టింగ్ మిస్టేక్ తెలుసా?

Published on Jul 24, 2024 12:14 PM IST

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమాలో ఇచ్చిన పలు రీసౌండింగ్ ఇండస్ట్రీ హిట్ చిత్రాల్లో దర్శకుడు బి గోపాల్ తో చేసిన సెన్సేషనల్ హిట్ సినిమా “ఇంద్ర” కూడా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో మొట్ట మొదటి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాగా వచ్చిన ఈ చిత్రం సరిగ్గా 22 ఏళ్ళు కితం విడుదల అయ్యింది. దీనితో మెగా ఫ్యాన్స్ 22 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ ఇండస్ట్రీ హిట్ స్మృతుల్లోకి వెళుతున్నారు.

అయితే మరో పక్క ఈ సినిమా రీరిలీజ్ కోసం కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈసారి చిరు బర్త్ డే కి అయినా వస్తుందా అని చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ మిస్టేక్ ఉందని చాలా మందికి తెలియకపోవచ్చు. కొంతమందికి తెలిసి కూడా ఉండొచ్చు. ఇంతకీ ఆ తప్పిదం ఏమిటంటే సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మెలోడియస్ ‘ఘల్లు ఘల్లుమని’ సాంగ్ లో రాయలసీమలో వర్షం పడడంతో సీమ ప్రజలు సంబరాలు చేసుకుంటారు.

కానీ ఆ తర్వాత ఓ సీన్ లో ఇంద్ర సేనుడి ఇంట్లో కుటుంబీకులు అంతా రంగులు జల్లుకుంటూ హోళీ చేసుకుంటారు. అయితే ఇక్కడే హోళితో పాటుగా రాఖీ పండుగ చేసుకుంటారు. చిరుకి తన చెల్లెల్లు రాఖీలు కడతారు. ఈ రెండు పండుగలు కూడా ఎప్పుడూ ఎక్కడా వచ్చింది లేదు. ఇలా ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ మిస్టేక్ అప్పట్లో జరిగిపోయింది.

ఆ సమయంలోనే చిరు కూడా ఈ మిస్టేక్ పై మాట్లాడుతూ ఈ సినిమాలో దాన్ని ఎవరైనా గమనించిన వారు ఉంటే వారిని కలుస్తాం అన్నట్టుగా కూడా పలు కాంటెస్ట్ లు కూడా పెట్టారు. ఇక ఈ చిత్రానికి మణిశర్మ ఐకానిక్ పాటలు, సాలిడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని అందించగా చిరు సరసన సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ ల హీరోయిన్స్ గా నటించారు. అలాగే కల్కి 2898 ఎడి నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ వారు ఈ సినిమాని నిర్మాణం వహించారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు