25 మిలియన్ వ్యూస్ తో “దేవర” ట్రైలర్!

25 మిలియన్ వ్యూస్ తో “దేవర” ట్రైలర్!

Published on Sep 11, 2024 12:01 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర చిత్రం ఈ నెల 27 వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలకి, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ ట్రైలర్ సెన్సేషన్ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది. ఇప్పటి వరకూ 25 మిలియన్స్ కు పైగా వ్యూస్ వచ్చాయి.

ఈ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. ట్రైలర్ లో యాక్షన్ ఎలిమెంట్స్, డైలాగ్స్ అలరిస్తున్నాయి. ట్రైలర్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా, సైఫ్ అలీఖాన్, అజయ్, పవిత్రా లోకేష్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ రవి చందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువ సుధ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు