25 మిలియన్ వ్యూస్ తో “గుంటూరు కారం” ట్రైలర్!

25 మిలియన్ వ్యూస్ తో “గుంటూరు కారం” ట్రైలర్!

Published on Jan 8, 2024 12:32 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరు కారం. ఈ చిత్రం ను జనవరి 12, 2024 న సంక్రాంతి పండుగ సందర్భంగా ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి, పాటలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్ కి ఆడియెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

ఈ ట్రైలర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ను ఫ్యాన్స్ ఎలా అయితే చూడాలి అని అనుకున్నారో, అదే రేంజ్ లో మేకర్స్ ప్రెజెంట్ చేశారు. ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే విధంగా యూ ట్యూబ్ లో 25 మిలియన్స్ కి పైగా వ్యూస్ తో టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఇదే సెన్సేషన్ రెస్పాన్స్ అని చెప్పాలి. యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో మీనాక్షి చౌదరి మరొక లేడీ లీడ్ రోల్ లో నటించింది. రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్, జయరామ్, జగపతి బాబు, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు