సమీక్ష: ’28 డిగ్రీ సెల్సియస్’ – కాన్సెప్ట్ బాగున్నా కథనం బాలేదు

28 Degree Celsius Movie Review In Telugu

విడుదల తేదీ : ఏప్రిల్ 04, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ :2.5/5
నటీనటులు : నవీన్ చంద్ర, షాలిని వడ్నికట్టి, ప్రియదర్శి, వైవా హర్ష, రాజా రవీంద్ర, జయ ప్రకాష్ తదితరులు.
దర్శకత్వం : డా. అనీల్ విశ్వనాధ్
నిర్మాణం : సాయి అభిషేక్
సంగీతం : శ్రవణ్ భరద్వాజ్, శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ : వంశీ పచ్చిపులుసు
ఎడిటర్ : గ్యారీ బిహెచ్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు నవీన్ చంద్ర హీరోగా పొలిమేర సినిమాలతో అలరించిన దర్శకుడు డాక్టర్ అనీల్ విశ్వనాధ్ తెరకెక్కించిన మరో థ్రిల్లర్ చిత్రం ’28 డిగ్రీస్ సెల్సియస్’ కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

కార్తీక్ (నవీన్ చంద్ర) ఒక అనాథ కాగా తన మెడికల్ కాలేజ్ లోనే చేరిన అంజలి (షాలిని వడ్నికట్టి) ని ప్రేమిస్తాడు. ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకున్నాక అంజలి ఇంట్లో వారి పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ రిజిస్టర్ పెళ్లి చేసుకుంటారు. అయితే ఇద్దరూ వైద్య వృత్తిలోనే ఉన్నప్పటికీ అంజలికి ఉన్న ఒక సమస్య మూలాన ఆమె కేవలం ’28 డిగ్రీ సెల్సియస్’ ఉష్ణోగ్రత దగ్గర మాత్రమే ఉండాల్సి వస్తుంది. ఇలా తాను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి విషయంలో కార్తీక్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు? వీరిద్దరూ ఆమె వైద్యం కోసం జార్జియా వెళ్లిన తర్వాత వీరి జీవితాలు ఎలా మలుపు తిరిగాయి. వారి దిగిన ఇంట్లో ఏమయ్యింది? వారి పక్కింటి వారి వల్ల వీరికొచ్చిన సమస్య ఏంటి? చివరికి అంజలికి ఏమయింది? కార్తీక్ ఏమవుతాడు అనేవి ఈ సినిమాలో మిగతా కథ.

ప్లస్ పాయింట్స్:

తెలుగు ఆడియెన్స్ కి పొలిమేర లాంటి సాలిడ్ థ్రిల్లర్స్ ని అందించిన దర్శకుడు అనీల్ విశ్వనాధ్ నుంచి వచ్చిన ఈ సినిమాలో కొన్ని కొన్ని చోట్ల డీసెంట్ థ్రిల్ మూమెంట్స్ ఉంటాయని చెప్పవచ్చు. మెయిన్ గా జస్ట్ ఇంటర్వెల్ సీన్ దగ్గర ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అలాగే సినిమాలో మెడికల్ గా చూపించిన లైన్ కొత్తగా అనిపిస్తుంది.

దీనికి అనుగుణంగా జోడించిన ఇద్దరు ప్రేమికుల ప్రేమ కథ అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. మెయిన్ లీడ్ పెళ్ళికి ముందు నవీన్ చెప్పిన డైలాగ్స్ ని దర్శకుడు బాగా రాసుకున్నారు. ఇక సెకండాఫ్ లో కొన్ని కొన్ని హారర్ ఎలిమెంట్స్ ని తీసుకెళ్లిన విధానం ఓకే అని చెప్పవచ్చు. ఇక నటీనటుల్లో నవీన్ చంద్ర తన రోల్ కి సెట్ అయ్యారు. తన పాత్రని సెటిల్డ్ గా బాగా చేసాడు.

అలాగే హీరోయిన్ షాలిని కూడా డీసెంట్ పెర్ఫామెన్స్ ని అందించారు. ఇద్దరి జంట ఆన్ స్క్రీన్ బానే ఉంది. ఇక వీరితో పాటుగా రాజా రవీంద్ర, జయ ప్రకాష్ లు తమ పాత్రల్లో సెట్ అయ్యారు బాగా చేశారు. గీత పాత్రలో చేసిన నటి ఒక సైకలాజికల్ సమస్య ఉన్న అమ్మాయిగా బాగా చేసింది.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో డీసెంట్ లైన్ ఉన్నప్పటికీ కథనం మాత్రం అంత ఎంగేజింగ్ గా సాగలేదు అని చెప్పక తప్పదు. నిడివి కూడా రెండు గంటల లోపే అయినప్పటికీ అలా నిదానంగా సాగుతూ సినిమా వెళుతుంది. ఇంటర్వెల్ సీన్ వచ్చే వరకు ఆడియెన్స్ కి మరీ అంత వావ్ మూమెంట్స్ కనిపించవు.

ఇక అక్కడ నుంచి మంచి ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది అనుకునే సెకండాఫ్ లో కూడా కొంతమేర నెమ్మది కథనం సాగుతుంది. సైంటిఫిక్ గా కొన్ని లాజిక్స్ ఓకే కానీ హారర్ ఎలిమెంట్స్ పరంగా లాజిక్స్ మిస్ అయ్యినట్టు అనిపిస్తుంది. అలాగే ఎడిటింగ్ లో కొన్ని సీన్స్ కట్స్ కూడా ప్రశ్నగా అనిపిస్తాయి. వాటినీ వదిలేసారు. వీటితో పాటుగా ఒక సమయంలో కథనం ఊహాజనితంగానే సాగుతుంది.

అలాగే కొన్ని ట్విస్ట్ లు లాంటివి మరీ అంత సర్ప్రైజ్ చేయవు. అలాగే హీరోయిన్ గా బెటర్ ఛాయిస్ ని ట్రై చేయాల్సింది. ఆమె వెస్ట్రన్ కాస్ట్యూమ్స్ లో సెట్ అయ్యారు కానీ తెలుగు అమ్మాయిలా సెట్ కాలేదు. ఇంకా వైవా హర్ష, ప్రియదర్శి లాంటి వారు ఉన్నారు తప్పితే వారి మీద సీన్స్ కూడా అంత ఆకట్టుకునేలా లేవు.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి. మ్యూజిక్ పర్వాలేదు. శ్రీచరణ్ పాకాల ఇచ్చిన స్కోర్ కొన్ని సందర్భాల్లో బాగుంది. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ గ్యారీ బి హెచ్ పనితనం కొన్ని సందర్భాల్లో మిస్ ఫైర్ అయ్యింది. కథనం ఇంకొంచెం స్పీడ్ గా నడిపించాల్సింది.

ఇక దర్శకుడు డాక్టర్ అనీల్ విశ్వనాధ్ విషయానికి వస్తే తాను సైన్స్, హారర్ ఎలిమెంట్స్ తో కలిపి లవ్ స్టోరీని మిక్స్ చేశారు కానీ పూర్తి స్థాయిలో తన కథనం మాత్రం అంత ఇంట్రెస్ట్ గా సాగలేదు. మెయిన్ కాన్సెప్ట్ పై తాను మంచి హోమ్ వర్క్ చేశారు కానీ దానిని ఎంగేజింగ్ గా నడిపించడంలో ఇంకా కేర్ తీసుకోవాల్సింది. కేవలం కొన్ని సీన్స్ వరకు తన వర్క్ సినిమాలో మెప్పిస్తుంది. కానీ పొలిమేర రేంజ్ లో ఆశిస్తే డిజప్పాయింట్ అవ్వక తప్పదు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ’28 డిగ్రీ సెల్సియస్’ చిత్రంలో లైన్ బాగుంది అలాగే కొన్ని కొన్ని మూమెంట్స్ వరకు ఓకే అనిపిస్తుంది. దర్శకుడు నడిపించిన కథనంలో కేవలం కొద్ది అంశాలు మాత్రమే ఆడియెన్స్ కి కనెక్ట్ కావచ్చు తప్పితే మిగతా అంశాల్లో మాత్రం ఈ థ్రిల్లర్ అంతగా ఆకట్టుకోదు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

Exit mobile version