వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “30 రోజుల్లో ప్రేమించడం ఎలా?”

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “30 రోజుల్లో ప్రేమించడం ఎలా?”

Published on Mar 20, 2022 6:38 PM IST

ప్రదీప్ మాచిరాజు హీరోగా దులిపుడి ఫణి ప్రదీప్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? గతేడాది జనవరి 29 వ తేదీన విడుదల అయిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించడం జరిగింది. ఎస్వీ ప్రొడక్షన్స్ పతాకంపై బాబు ఎస్వీ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధం అవుతోంది.

జీ తెలుగు ఛానల్ లో ఈ చిత్రం త్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతుంది. ఇప్పటికే ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ పొందిన ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను దక్కించుకుంటుందో చూడాలి. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం కి అనూప్ రూబెన్స్ సంగీతం అందించడం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు