Devara: “దేవర” కోసం 30 నిద్ర లేని రాత్రులు..

Devara: “దేవర” కోసం 30 నిద్ర లేని రాత్రులు..

Published on Sep 21, 2024 7:08 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ “దేవర” మరి సాలిడ్ హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు. మరి ఆ రోజు దగ్గరకి వస్తున్న తరుణంలో మేకర్స్ ప్రమోషన్స్ ని కూడా చాలా అగ్రెసివ్ గా చేస్తున్నారు.

అయితే ఈ గ్యాప్ లో ఈ చిత్రానికి మైండ్ బ్లాకింగ్ విజువల్స్ ని అందించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేయడం జరిగింది. దేవర లో భారీ వి ఎఫ్ ఎక్స్ షాట్స్ ని మ్యాచ్ చేసే కలర్ గ్రేడింగ్ షాట్స్ తీయడానికి 30 నిద్ర లేని రాత్రులు మేము గడపాల్సి వచ్చింది అని అలాగే ఐమాక్స్, ఎక్స్ డి, ప్రీమియర్ లార్జ్ ఫార్మాట్ వంటి కంటెంట్ అందజేసేసామని రత్నవేలు సినిమాపై ఫ్యాన్స్ కి ఇంట్రెస్టింగ్ క్లారిటీ ఇచ్చేసారు. ఇక దేవర మీది చూసి ఎంజాయ్ చెయ్యండి అన్నట్టుగా సినిమాలో ఐకానిక్ షాట్స్ షూటింగ్ విజువల్స్ ని షేర్ చేసి తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు