ఓటిటిలో “35” చిన్న కథ కాదుకి పెద్ద రెస్పాన్స్


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ నివేతా థామస్ హీరోయిన్ గా యువ నటుడు విశ్వదేవ్ రాచకొండ హీరోగా దర్శకుడు నంద కిషోర్ ఈమని తెరకెక్కించిన బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “35 చిన్న కథ కాదు”. మరి గత సెప్టెంబర్ లో రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం తెలుగు ఆడియెన్స్ మన్ననలు అందుకొని మంచి వసూళ్లు సాధించింది. అలాగే రీసెంట్ గానే ఈ చిత్రం ఓటిటిలో కూడా విడుదలకి వచ్చింది.

మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా వారు ఈ చిన్న సినిమా చిన్న కథని స్ట్రీమింగ్ కి తీసుకురాగా ఇందులో ఈ సినిమాకి పెద్ద రెస్పాన్స్ ఇపుడు నమోదు అయ్యింది. మరి ఓటిటిలో ఈ సినిమాకి ఏకంగా 70 మిలియన్ కి పైగా స్ట్రీమింగ్ మినిట్స్ నమోదు అయ్యాయి. దీనితో ఓటిటిలో కూడా ఈ చిత్రానికి అద్భుత స్పందన లభించింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించగా సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మాణం వహించారు.

Exit mobile version