ఓటీటీలోకి వచ్చేసిన ‘35 – చిన్న కథ కాదు’

ఓటీటీలోకి వచ్చేసిన ‘35 – చిన్న కథ కాదు’

Published on Oct 2, 2024 2:00 AM IST

టాలీవుడ్‌లో రీసెంట్‌గా రిలీజ్ అయిన ‘35 – చిన్న కథ కాదు’ బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. యంగ్ బ్యూటీ నివేదా థామస్ ఈ సినిమాలో లీడ్ రోల్‌లో నటించింది. ఆమెతో పాటు విశ్వేదేవ్, ప్రియదర్శి, గౌతమి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు నందకిషోర్ ఈమని డైరెక్ట్ చేశారు.

ఇక ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో, బాక్సాఫీస్ దగ్గర ఇది విజయం అందుకుంది. కాగా, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ‘35-చిన్న కథ కాదు’ నేటి నుంచి స్ట్రీమింగ్‌కి వచ్చేసింది.

ఫ్యామిలీ ఆడియెన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా కావడంతో, చిత్రం ఓటీటీలోనూ సాలిడ్ రెస్పాన్స్‌‌ను అందుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ చక్కటి సంగీతాన్ని అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు