యూఎస్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్న ‘35 చిన్న కథ కాదు’

యూఎస్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్న ‘35 చిన్న కథ కాదు’

Published on Sep 9, 2024 10:22 PM IST

టాలీవుడ్‌లో ఈ మధ్య చిన్న సినిమాల జోరు కొనసాగుతోంది. ఇటీవల ‘కమిటీ కుర్రాళ్ళు, ఆయ్’ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ సాధించాయి. ఇప్పుడు మరో సినిమా బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. యంగ్ బ్యూటీ నివేదా థామస్ నటించిన పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ‘35-చిన్న కథ కాదు’ రీసెంట్‌గా రిలీజ్ అయ్యింది.

ఈ సినిమా కథను ప్రతి ఒక్కరు ఓన్ చేసుకుంటుండటంతో ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇక ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర కూడా సెన్సేషనల్ రన్ కొనసాగిస్తోంది. ఈ సినిమాకు యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 100K డాలర్ల గ్రాస్ వసూళ్లు రావడంతో ఈ సినిమాకు ఆడియెన్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో విశ్వదేవ్, ప్రియదర్శి, గౌతమి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను నందకిషోర్ ఈమని డైరెక్ట్ చేయగా, రానా దగ్గుబాటి ప్రెజెంట్ చేశాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు