‘క‌ల్కి’తో క‌లిసి వ‌స్తోన్న ’35’ టీజ‌ర్

ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘క‌ల్కి 2898 AD’ రేపు ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న ఈ సైన్స్ ఫిక్ష‌న్ మూవీని ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మ‌కంగా రూపొందించారు. ఇక ఈ సినిమా రిలీజ్ లో ప్రేక్ష‌కుల‌కు ఓ స్వీట్ స‌ర్ప్రైజ్ ఉండ‌నుంది.

మ‌ల‌యాళ భామ నివేదా థామ‌స్ ముఖ్య పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ’35’ ఇప్ప‌టికే షూటింగ్ ప‌నులు ముగించుకుంది. ఈ సినిమాను రానా ద‌గ్గుబాటి ప్రొడ్యూస్ చేస్తుండ‌టంతో ఈ మూవీపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అయితే, ఈ సినిమా టీజ‌ర్ ను ‘క‌ల్కి’ మూవీ రిలీజ్ అయ్యే పివిఆర్ సినిమాస్ లో ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. ఈ మేరకు ’35’ చిత్ర యూనిట్ అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ చేశారు.

ఇక ’35’ మూవీకి ‘చిన్న క‌థ కాదు’ అనే ట్యాగ్ లైన్ ను ఫిక్స్ చేశారు. “ఇదో, మీరు జూస్తే చాలు, మాక‌దే ప‌దేలు..” అంటూ మేక‌ర్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రియ‌ద‌ర్శి, విశ్వ‌దేవ్ లు ఇత‌ర‌ ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగ‌స్టు 15న రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ రెడీ అవుతున్నారు.

Exit mobile version