50 మిలియన్స్ వ్యూస్ తో “చుట్టమల్లె” సాంగ్!

50 మిలియన్స్ వ్యూస్ తో “చుట్టమల్లె” సాంగ్!

Published on Aug 8, 2024 9:00 PM IST

ఈ ఏడాది అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా చిత్రాల్లో దేవర ఒకటి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్, యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఇప్పటికే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రిలీజైన రెండు పాటలకు మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి.

ఈ చిత్రం నుండి ఇటీవల రిలీజైన సెకండ్ సింగిల్ చుట్టమల్లె విపరీతమైన ఆదరణతో దూసుకు పోతుంది. ఇప్పటి వరకూ 50 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్న ఈ చిత్రం పై అందరిలో ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు