యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ దేవర చిత్రం ఏప్రిల్ 5, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కానుంది. ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం నుండి నిన్న మేకర్స్ గ్లింప్స్ వీడియో ను తెలుగు భాషతో పాటుగా, ఇతర భారతీయ ప్రధాన బాషల్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది.
ఈ గ్లింప్స్ వీడియో కి సెన్సేషన్ రెస్పాన్స్ వస్తోంది. ఈ గ్లింప్స్ వీడియో ఇప్పటి వరకూ 57 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను రాబట్టడం జరిగింది. ప్రస్తుతం గ్లింప్స్ వీడియో యూ ట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తుండగా, రాక్ స్టార్ అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.