6 మిలియన్ వ్యూస్ తో డెవిల్ ట్రైలర్

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో, అభిషేక్ నామా నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ డెవిల్. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ను డిసెంబర్ 29, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లోకి తీసుకు వచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది.

ఈ చిత్రం కి సంబందించిన ట్రైలర్ ను నిన్న రిలీజ్ చేయగా, సూపర్ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది. ఇప్పటి వరకూ 6 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. యూ ట్యూబ్ లో ట్రైలర్ టాప్ లో ట్రెండ్ అవుతోంది. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం లో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం రిలీజ్ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Exit mobile version