సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తీ సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ను మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్ టైన్మెంట్స్ మరియు 14 రీల్స్ ప్లస్ పతాకం పై నిర్మిస్తున్నారు. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి సెన్సేషన్ రెస్పాన్స్ వస్తోంది.
ఈ చిత్రం నుండి కళావతి పాటను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పాటకు సోషల్ మీడియా లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. రీల్స్ సైతం 100కే కి పైగా రావడం విశేషం. అయితే ఈ సాంగ్ ఇప్పుడు యూ ట్యూబ్ లో భారీ వ్యూస్ తో దూసుకు పోతుంది. ఇప్పటి వరకూ 60 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని మే 12, 2022 న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.