65 మిలియన్ వ్యూస్ తో “సూర్య44” లేటెస్ట్ ప్రోమో!

65 మిలియన్ వ్యూస్ తో “సూర్య44” లేటెస్ట్ ప్రోమో!

Published on Jul 23, 2024 10:00 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తదుపరి కంగువ చిత్రంలో కనిపించనున్నారు. డైరెక్టర్ శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 10వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రం తరువాత సూర్య చేయబోయే ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజుతో సూర్య ఒక చిత్రాన్ని చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సూర్య 44 అనే టైటిల్ ను తాత్కాలికంగా పెట్టడం జరిగింది. సూర్య పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఒక పవర్ ఫుల్ ప్రోమో ను విడుదల చేయడం జరిగింది.

సూర్య చాలా అగ్రెసివ్ గా ఈ ప్రోమోలో కనిపిస్తున్నాడు. ఈ ప్రోమో కి ఆడియెన్స్ నుండి, ఫ్యాన్స్ నుండి సెన్సేషన్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకూ ఈ వీడియోకి 65 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఇప్పటి వరకు ఏ సినిమా ప్రోమో కూడా ఈ రేంజ్ రెస్పాన్స్ ను అందుకోలేదు. ది వన్ సూర్య కి ఫ్యాన్స్ మంచి గిఫ్ట్ అందించారు. ఈ చిత్రంకు సంబందించిన టైటిల్ టీజర్ త్వరలో రిలీజ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రంకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు