ఓటిటిలోకి వచ్చేసిన 66 కోట్లు కొల్లగొట్టిన లేటెస్ట్ క్రేజీ సినిమా.!

Published on May 27, 2022 7:30 pm IST


రీసెంట్ గా సౌత్ ఇండియన్ సినిమా దగ్గర రిలీజ్ అయ్యిన చిత్రాల్లో కోలీవుడ్ విలక్షణ నటుడు మక్కల్ సెల్వం విజయ్ సేతుపతి అలాగే హీరోయిన్ లు సమంతా మరియు నయనతార లాంటి బిగ్ స్టార్స్ కలయికలో వచ్చిన చిత్రం “కన్మణి రాంబో కతిజ” కూడా ఒకటి. తమిళ్ మరియు తెలుగులో రిలీస్ అయ్యిన ఈ చిత్రం తమిళ నాట సూపర్ హిట్ అయ్యి ఇప్పటి వరకు 66 కోట్ల గ్రాస్ ని అందుకుని హిట్ గా నిలిచింది.

మరి ఇప్పుడు ఈ సినిమా తమిళ్ మరియు తెలుగు భాషల్లో ఓటిటి స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ప్రముఖ ఓటిటి యాప్ డిస్నీ+ హాట్ స్టార్ లో ఈరోజు నుంచే మేకర్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక ఈ సినిమాకి విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించగా అనిరుద్ సంగీతం అందించాడు. అలాగే 7 స్క్రీన్ స్టూడియోస్ వారు ఈ క్రేజీ లవ్ స్టోరీ ని నిర్మాణం వహించారు. మరి అప్పుడు ఎవరైనా మిస్ అయితే ఇప్పుడు చూసేయ్యొచ్చు.

సంబంధిత సమాచారం :