“అఖండ” మాస్ జాతర కి భారీ రెస్పాన్స్!

Published on Nov 29, 2021 4:00 pm IST

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం అఖండ. బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబో లో వస్తున్న సినిమా అంటేనే హై ఓల్టేజ్ యాక్షన్ తో పాటుగా మాస్ డైలాగ్స్ ఉంటాయి. అభిమానులకు ఈ చిత్రం కన్నుల పండుగ గా ఉంటుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. ద్వారక క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు సినిమా పై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రం నుండి మాస్ జాతర విడుదల అయ్యింది. సోషల్ మీడియా లో ఇది కాస్త విపరీతంగా ఆకట్టుకుంటుంది. యూ ట్యూబ్ లో ఈ వీడియో కి 7 మిలియన్స్ కి పైగా వ్యూస్ రావడం విశేషం. బాలయ్య ఈ చిత్రం తో బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తారు అని ప్రేక్షకులు, అభిమానులు భావిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీకాంత్, జగపతి బాబు లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :