‘పుష్ప రాజ్’ రూలింగ్ కి ఇక 75 రోజులే !

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న ‘పుష్ప 2 ది రూల్’ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, తాజాగా మేకర్స్ ‘పుష్ప 2’ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చారు. డిసెంబర్ 6న రిలీజ్ కానున్న ఈ సినిమా రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలెడుతూ ఓ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. కేవలం 75 రోజుల్లో ‘పుష్ప రాజ్’ రూలింగ్ చూడబోతున్నారు అంటూ మేకర్స్ ఈ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ సినిమాలో వచ్చే జాతర పాట సినిమాకే హైలైట్ గా నిలుస్తోందట. పైగా ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. దీంతో, ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా హిందీలో పుష్పకి ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇక ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇక మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ పాన్ ఇండియన్ రేంజ్ లో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version