నటీనటులు రవికృష్ణ హీరోగా సోనియా అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు సెల్వ రాఘవ తెరకెక్కించిన కల్ట్ క్లాసిక్ లవ్ డ్రామా “7/జి బృందావన కాలనీ” కోసం అందరికీ తెలిసిందే. మరి మళ్లీ ఇన్నాళ్ల తర్వాత రీ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా అయితే థియేటర్స్ లో క్రేజీ రెస్పాన్స్ ని మొదటి రోజు అందుకుంది. మరి డే 1 తో పాటుగా రెండో రోజు కూడా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అదే రీతి రెస్పాన్స్ ని అందుకున్నట్టుగా మేకర్స్ చెప్తున్నారు.
ఇంకా రెండో రోజుకు అయితే అదనపు షోలు అదనపు స్క్రీన్స్ కూడా ఈ చిత్రానికి దక్కడం మరో విశేషం. దీనితో రెండో రోజు వసూళ్లు కూడా గట్టిగానే వస్తాయని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా శ్రీ సూర్య ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.