మరో భారీ చిత్రం కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం 83. లెజెండరీ క్రికెటర్ కపిల్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామా ఏప్రిల్ 10న విడుదల కావాల్సివుంది. ఐతే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే కార్యక్రమంలో భాగంగా 83 మూవీ నిర్మాతలు చిత్ర విడుదల వాయిదావేస్తునట్లు ప్రకటించారు. 83 భారతీయులందరి చిత్రం అన్న నిర్మాతలు దేశభద్రత, సేఫ్టీ ముఖ్యం, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం అని చెప్పుకొచ్చారు.
రణ్వీర్ సింగ్ ఈ మూవీలో కపిల్ దేవ్ గా నటిస్తుండగా కపిల్ భార్య పాత్ర దీపికా పదుకొనె చేయడం విశేషం. డైరెక్టర్ కబీర్ ఖాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, విష్ణు ఇందుకూరి, షాజిద్ నడియావాలా, కబీర్ ఖాన్ నిర్మాతలుగా ఉన్నారు. పాన్ ఇండియా మూవీగా పలు భాషలలో ఈ చిత్రం విడుదల కానుంది.
83 is not just our film but the entire nation’s film. But the health and safety of the nation always comes first. Stay safe, take care
We shall be back soon!@RanveerOfficial @kabirkhankk @deepikapadukone @Shibasishsarkar #SajidNadiadwala @RelianceEnt @vibri_media #83themovie pic.twitter.com/4qmPd3z2SZ
— Vishnu Vardhan Induri (@vishinduri) March 20, 2020