“గేమ్ ఛేంజర్” పై ఓ బ్యాడ్ న్యూస్ రెండు గుడ్ న్యూస్..

“గేమ్ ఛేంజర్” పై ఓ బ్యాడ్ న్యూస్ రెండు గుడ్ న్యూస్..

Published on Oct 8, 2024 1:00 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే అంజలీ హీరోయిన్స్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ “గేమ్ ఛేంజర్” కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా నుంచి మేకర్స్ వరుస అప్డేట్స్ ని ఇస్తున్న తరుణంలో ఈ దసరా కానుకగా అయితే టీజర్ ని ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు.

కానీ ఇప్పుడు బ్యాడ్ న్యూస్ ఏమిటంటే “గేమ్ ఛేంజర్” టీజర్ మాత్రం ఇప్పుడు రావడం లేదని సంగీత దర్శకుడు థమన్ క్లారిటీ ఇచ్చేసాడు. టీజర్ దసరా రావట్లేదని డిజప్పాయింట్ కాకండి టీజర్ కి ఇంకా సిజి వర్క్స్ డబ్బింగ్, ఫైనల్ ఎడిటింగ్ ఇంకా అవుతున్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్రెడీ స్టార్ట్ చేసానని తాను తెలిపాడు.

దీనితో చరణ్ ఫ్యాన్స్ ఇప్పుడు ఒకింత బాగా డిజప్పాయింట్ అయ్యారు. ప్రస్తుతం ఉన్న పెద్ద సినిమాల్లో ఇంకా ఎలాంటి టీజర్ లేకుండా ఉన్న సినిమా గేమ్ ఛేంజర్ ఒకటే అని చెప్పొచ్చు. అందుకే వారు నిరాశలో ఉన్నారు కానీ థమన్ మరో రెండు గుడ్ న్యూస్ లు కూడా దీనితో అందించాడు. సినిమాలో 3వ సాంగ్ ని మొదటిగా నవంబర్ లో రిలీజ్ చేస్తున్నట్టు తెలిపాడు.

కానీ ఇప్పుడు దీనిని ఈ అక్టోబర్ 30నే విడుదల చేస్తున్నట్టు డేట్ అనౌన్స్ చేసేసాడు. ఇక దీనితో పాటుగా గేమ్ చేంజర్ సంక్రాంతికి వాయిదా పడుతుంది అని కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి తాను మళ్ళీ డిసెంబర్ 20 లేదా క్రిస్మస్ కానుకగా గేమ్ ఛేంజర్ రాబోతున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసాడు. సో ఇలా రెండు గుడ్ న్యూస్ లు ఓ బ్యాడ్ న్యూస్ అయితే మెగా అభిమానులకి ఇప్పుడు వచ్చింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు