‘శర్వా 37’ నుంచి సంయుక్తపై బ్యూటిఫుల్ పోస్టర్..

‘శర్వా 37’ నుంచి సంయుక్తపై బ్యూటిఫుల్ పోస్టర్..

Published on Sep 11, 2024 10:59 AM IST

మన టాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో తన కెరీర్ 37వ సినిమా కూడా ఒకటి. దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. మరి వారిలో యువ నటి సాక్షి వైద్య ఒకరు కాగా మరో నటి టాలెంటెడ్ సంయుక్త మీనన్ కూడా ఈ చిత్రంలో నటిస్తుంది. మరి ఈ చిత్రం నుంచి మేకర్స్ నేడు సంయుక్త పుట్టినరోజు కానుకగా ఒక బ్యూటిఫుల్ పోస్టర్ ని రిలీజ్ చేసారని చెప్పాలి.

సినిమాలో ఈమె దియా అనే పాత్రలో నటిస్తుండగా ఆ పేరుకి తగ్గట్టుగానే చేతిలో వెలుగుతో దీపాలు పట్టుకొని సంయుక్త ఎంతో అందంగా కనిపిస్తుంది. దీనితో ఈ సినిమా నుంచి ఈమెకి నేడు పర్ఫెక్ట్ గిఫ్ట్ అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత అనీల్ సుంకర నిర్మాణం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా పూర్తవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు