మన టాలీవుడ్ సినిమా దగ్గర మూవీ లవర్స్ కి కానీ సినీ ఇండస్ట్రీకి గాని పెద్ద పండుగ సీజన్ ఏదన్నా ఉంది అంటే అది కొత్త ఏడాది మొదలు తోనే వచ్చే తెలుగు పండుగ సంక్రాంతి సీజన్ అని చెప్పాలి. ఈ రేస్ లో వచ్చే సినిమాలు ఆ భారీ క్లాష్ లతో చలి కాలంలో కూడా ఫ్యాన్స్ కి టెన్షన్ తో చెమటలు పడతాయి. అలా ఇన్నేళ్లలో పలు భారీ క్లాష్ లు కంప్లీట్ అయ్యి ఇక నెక్స్ట్ 2024 సంక్రాంతి రాబోతుంది.
అయితే ఈ క్లాష్ లో కూడా పలు భారీ సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఆల్రెడీ డేట్ లు లాక్ చేసుకుని ఇంకా డేట్ ఫైనలైజ్ చేయాల్సిన సినిమాలు కూడా సంక్రాంతికే ఫిక్స్ అయ్యి ఉన్నాయి. మరి ప్రస్తుతానికి “హనుమాన్”, “గుంటూరు కారం”, “ఈగల్”, “నా సామిరంగా” చిత్రాలు అఫీషయల్ గా ఫిక్స్ కాగా ప్రభాస్ కల్కి కూడా రేస్ లో ఉంది.
అయితే ఈ చిత్రాల్లో ఒకటి మాత్రం రేస్ నుంచి తప్పుకోనున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. లేటెస్ట్ బజ్ ప్రకారం అయితే అదే జనవరిలో లేదా మరో నెలకి ఆ సినిమా షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి అది ఏ చిత్రం అనేది కాలమే నిర్ణయించాలి.