గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన సెన్సేషనల్ అవైటెడ్ చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సాలిడ్ కమర్షియల్ డ్రామాగా ప్లాన్ చేయగా ఇపుడు ఆఫ్ లైన్ లో మేకర్స్ ప్రమోషన్స్ ని ఓ రేంజ్ లో కొనసాగిస్తున్నారు.
అలా లేటెస్ట్ గా భారీ కటౌట్ రామ్ చరణ్ పై లాంచ్ చేయగా ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు మెగా అభిమానులకి ఫుల్ జోష్ ఇచ్చే స్పీచ్ ని అందించారు అని చెప్పాలి. అయితే తాను మాట్లాడుతూ ఈ చిత్రంపై చరణ్ పై బిగ్ సర్ప్రైజ్ ఎలిమెంట్ ని రివీల్ చేసేసారు. ఇన్ని రోజులు చరణ్ ఈ చిత్రంలో ఒక స్టూడెంట్ గా ఐఏఎస్ ఆఫీసర్ గా అలాగే అప్పన్న పాత్రలో రాజకీయ నాయకునిగా కనిపిస్తాడని అందరికీ తెలిసిందే.
కానీ ఇపుడు దిల్ రాజు వీటితో పాటుగా చరణ్ మళ్ళీ క్రేజీ రోల్ పోలీస్ ఆఫీసర్ గా కొంతసేపు కనిపిస్తాడని ఊహించని లీక్ అందించారు. దీనితో RRR అనంతరం మళ్ళీ గ్లోబల్ స్టార్ పోలీస్ గా కనిపించనున్నాడని చెప్పాలి. అలాగే ట్రైలర్ పై కూడా దిల్ రాజు కామెంట్స్ చేశారు. ఈ జనవరి 1న ట్రైలర్ ని వదిలే ఆలోచనలో ఉన్నట్టుగా రివీల్ చేశారు. మొత్తానికి ఒక బ్యాంగ్ తో గేమ్ ఛేంజర్ ఏడాది మొదలు కాబోతుంది అని చెప్పాలి.