టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ నటించిన లేటెస్ట్ చిత్రం చాలా కాలం గ్యాప్ తర్వాత వస్తుంది. ఆ సినిమానే “కృష్ణమ్మ”. మంచి మాస్ సబ్జెక్టుగా దర్శకుడు వివి గోపాలకృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం సత్యదేవ్ లోని మాస్ అండ్ యాక్షన్ కోణాన్ని ఓ రేంజ్ లో చూపించేలా కనిపిస్తుంది. ఇప్పటికే సాలిడ్ పోస్టర్స్ తో అదరగొట్టిన సత్యదేవ్ ఈ మే 3న థియేటర్స్ లోకి రావాల్సి ఉంది కానీ లేటెస్ట్ గా మేకర్స్ ఈ సినిమాని ఈ డేట్ నుంచి తప్పించారు.
పలు కారణాలు చేత వాయిదా వేసిన ఈ సినిమాని మేకర్స్ ఈ మే 10న అయితే గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా మరో ఇంటెన్స్ పోస్టర్ తో అనౌన్స్ చేశారు. మరి ఎన్నికల మూమెంట్ లో రిస్క్ తీసుకొని వస్తున్నా ఈ చిత్రం ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించగా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ వారు అలాగే ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ వారు రిలీజ్ చేస్తుండగా దేవర దర్శకుడు కొరటాల శివ సమర్పణలో ఈ చిత్రం విడుదలకి రాబోతుంది.