రాధే శ్యామ్’ బిగ్ సప్రైజ్.. ఉత్కంఠలో అభిమానులు

Published on Oct 21, 2020 1:38 am IST


ఈమధ్య ప్రభాస్ సినిమాల అప్డేట్స్ బాగా ఆలస్యమవుతున్నాయని ఆయన అభిమానులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఎప్పుడో కానీ అప్డేట్ రావట్లేదని, ఒక పద్దతి ప్రకారం అప్డేట్స్ ఇస్తే బాగుంటుందని నిర్మాణ సంస్థల్ని కోరుతున్నారు. వారి కోసమే ‘రాధే శ్యామ్’ నిర్మాతలు వరుస సప్రైజెస్ ప్లాన్ చేశారు. ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు కావడంతో ‘బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్’ పేరుతో ఒక మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారు. అయితే అంతకంటే ముందు ఇంకో అప్డేట్ ఇవ్వనున్నారు.

ఈ అప్డేట్ 21వ తేదీన రిలీజ్ కానుంది. ఇది కూడ పెద్ద అప్డేట్ అని తెలుస్తోంది. మే బీ ఇది ప్రభాస్ లుక్ గురించైనా లేదా టీజర్ విడుదల గురించైనా అయ్యుండొచ్చని అభిమానులు భావిస్తున్నారు. మరి అది ఏమై ఉంటుందో తెలియాలంటే ఇంకొద్ది గంటలు ఆగాల్సిందే. ఇకపోతే ఈరోజు చిత్ర సంగీత దర్శకుడిగా జస్టిన్ ప్రభాకరన్ పేరును అనౌన్స్ చేశారు నిర్మాతలు. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే యేడాది విడుదల చేయనున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :

More