ఓటిటి : అమేజాన్ ప్రైమ్ వీడియోపై కేసు.!


వరల్డ్ వైడ్ గా కూడా మంచి పాపులర్ అయ్యిన కొన్ని దిగ్గజ ఓటిటి స్ట్రీమింగ్ యాప్స్ లో అమేజాన్ ప్రైమ్ వీడియో కూడా ఒకటి. మరి ప్రైమ్ వీడియో అనేక దేశాలతో పాటుగా మన దేశంలో కూడా మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. అయితే అందులో కంటెంట్ పరంగా సబ్ స్క్రైబర్స్ లో కొన్ని కంప్లైంట్స్ ఉన్నప్పటికీ పలు చిత్రాలు వెబ్ షోస్ పరంగా మాత్రం ప్రైమ్ వీడియో టాప్ లోనే గట్టి పోటీ ఇస్తుంది.

దీనితో నెమ్మదిగా ప్రైమ్ వీడియో వారు తమ బిజినెస్ ని కొన్ని లొసుగులతో జనం నుంచి మరింత డబ్బులు పిండడం స్టార్ట్ చేశారు. ఆల్రెడీ వార్షికంగా ఉన్న చార్జెస్ ని వరల్డ్ వైడ్ గా కూడా పెంచారు. ఇదే భారం అనుకుంటే మళ్ళీ ఆ సబ్ స్క్రిప్షన్ లో యాడ్స్ వేస్తామని మళ్ళీ యాడ్స్ లేకుండా చూడాలి అంటే ఇంకా అదనంగా డబ్బులు చెల్లించాలి అని ఆ మధ్య టాక్ వచ్చింది.

తర్వాత గత జనవరి 29 నుంచి స్టార్ట్ చేసింది. అయితే ఇప్పుడు దీనిపై యూఎస్, కాలిఫోర్నియాలో కేసు నమోదు అయ్యింది. అక్కడ ఓ సబ్ స్క్రైబర్ వార్షికానికి తీసుకోగా తనకి మళ్ళీ యాడ్ ఫ్రీ చూడాలి అంటే అదనంగా డబ్బులు అడుగుతున్నారని కేసు వేసాడు.తాను ప్రైమ్ వీడియో తీసుకున్నదే ఎలాంటి అడ్వర్టైస్మెంట్ లు లేకుండా చూసేందుకే అని తాము కూడా అలానే చెప్పారని కానీ ఇప్పుడు అదనంగా డబ్బులు వసూలు చేస్తుండడం సరికాదని కేసు వేసాడు.

అయితే దీనిపై ఇంకా ప్రైమ్ వీడియో వారు స్పందించలేదని తెలుస్తుంది. మరి ఈ విషయంలో ప్రైమ్ వీడియో ఏమన్నా వెనక్కి తగ్గుతుందేమో చూడాలి. ఇక మరోపక్క ప్రైమ్ వీడియో ఇదే అదనపు చార్జీలు ఇండియాకి కూడా తీసుకొస్తారని టాక్ ఉంది. ప్రస్తుతానికి అయితే మన దగ్గర ఇంకా రాలేదు. ఒకవేళ వస్తే మన దగ్గర స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version